Fashion News-ఫ్యాషన్ న్యూస్ »
Arvind Khadi Denim Jeans Coming soon in Market అరవింద్ సంస్థ ద్వారా మార్కెట్లోకి రానున్న 'ఖాదీ డెనిమ్ జీన్స్'

Arvind Khadi Denim Jeans Coming soon in Market

అరవింద్ సంస్థ ద్వారా మార్కెట్లోకి రానున్న 'ఖాదీ డెనిమ్ జీన్స్'  


వస్త్రం తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద  డెనిమ్ వస్త్ర ఉత్పత్తిదారు అయిన  అరవింద్ సంస్థ త్వరలో ఖాదీ జీన్స్ ను మార్కెట్లోకి ప్రవేశ పెట్టబోతుంది. ఇందు కోసం ఈ సంస్థ కొంతమంది పనివారితో ఒప్పందం కుదుర్చుకుంది. ఒక జత ఖాదీ జీన్స్ తయారీకి దాదాపు 300  మంది పనివారి అవసరముంటుంది. ఎందుకంటే ఖాదీని యంత్రాలపై తయారు చేయలేనిది. వాటిని కేవలం రాట్నాల మీద మాత్రమే నేస్తారు. కనుక జత జీన్స్ ధర రూ. 10 ,000 లతో అధికంగా ఉన్నది.

ఇప్పటికే ఫ్యాషన్ డిజైనర్లు ఖాదీ జీన్స్ ను స్టైల్ కు ఒక చిహ్నం గా ధరించడం కారణంగా త్వరలో తయారయ్యే డెనిమ్ వస్త్రంతో కూడిన ఖాదీ జీన్స్ కు మంచి మార్కెట్ ఉంటుందని అరవింద్ సంస్థ సీఎమ్ డీ సంజయ్ లాల్ బాయ్ తెలియచేశారు. గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన రెండు ఎన్ జీవో సంస్థలతో వస్త్ర తయారీ కోసం ఒప్పందం చేసుకున్నామని ఈ సందర్భంగా ఆయన వివరించారు.

 
Own Videos Back to Menu
No videos
Youtube Links Back to Menu
కూకట్ పల్లి – చందనబ్రదర్స్ ఫుట్ వేర్ విభాగం 11 ఏప్రిల్ 2012న ఉ. 11 : 15 ని.లకు టాలీవుడ్ స్టార్ దీక్షాసేథ్ చే కూకట్ పల్లి లో ప్రారంభమగును.